Posts

ఋషి వంటి సంసారి ... మా కృష్ణ మావయ్య

Image
ఋషి వంటి సంసారి ... మా కృష్ణ మావయ్య నమ్మబుద్ధి కావటం లేదు... నమ్మక తప్పటం లేదు... శ్రీ ఆకెళ్ళ సూర్యనారాయణ గారి ఆఖరు అబ్బాయి సహోద్యోగులకు గోపాల్ సన్నిహితులకు కృష్ణ మా అందరికీ .... ప్రియమైన ‘కృష్ణ మావయ్య’ ఈయన....వెళ్ళిపోయారు.... *** తను మా నలుగురు మేనమామలలో ఆఖరి వాడే కాదు చిట్టచివరి వరకు తన పై వారి అందరి కుటుంబాలలోని మంచి, చెడ్డలకు అండగా నిలచిన పెద్దదిక్కు కూడా... *** చిరునవ్వును వీడని వాడు విసుగెన్నడు చూపని వాడు పల్లెత్తు మాటలాడని వాడు పరులనెపుడు నిందించని వాడు బాధలకు బెదరని వాడు బాధ్యతలకు వెరవని వాడు... సంసారి గా కనిపిస్తూనే సన్యాసిగా జీవించినవాడు... *** యవ్వనంలో కమల్ హాసన్ గా కనిపించి తన కమ్మని   పాటలతో మాకు ఆరాధ్యుడుగా మారినా,   వయసు పెరిగే కొద్దీ అయ్యప్ప మహిమాన్విత భక్తి పారవశ్య దీక్షలో మునిగి,   తన రూపంలోనూ, గానంలోనూ, భక్తిభావం లోనూ మా ఇంటి జేసుదాస్ గా మారాడు అనడంలో అతిశయోక్తి లేదు... *** నిత్యం రైల్వే యంత్రాల మధ్య కఠోర శ్రమలో అలసిపోయిన సహోద్యోగులకు తన అయ్యప్ప గీతాల గాన మాధుర్యం పంచినా, స్కౌట్

'అభినందన' చందనాలు ప్రియ భారత సైనికుడా!

Image